అన్న చెల్లెల అనుబంధం : సురేష్ రెడ్డి

అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ వచ్చేస్తోంది. రాఖీ అంటే ‘రక్షణ’ అని అర్థముంది. రాఖీ పండుగనే రక్షా బంధన్ అని పిలుస్తారు. ‘రక్ష’ అంటే రక్షించడం, ‘ బంధన్’ సూత్రం కట్టడం అని అర్థం.
అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడుగేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ. . రాఖీ కడుతుంది.
సోదరుడి విజయాన్ని సోదరి కాంక్షిస్తే.
ఏ కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు చేతుల్లో పెరిగాను, నీ వెనుకే తిరిగాను నువ్వు గారం చేస్తుంటే పసి పాపనవుతా..
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా.. అన్నయ్యా నన్ను దీవించు.. కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు.. ప్రియమైన నీ చెల్లెలు. ఏడిస్తే ఊరడించావ్.. ఆకలేస్తే తినిపించావ్.. నాకు ఆనందం పంచడానికి అహర్నిశలు శ్రమించావ్.. అన్నయ్యా..
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను.. మరు జన్మలోనూ నీ చెల్లినై పుట్టాలని కోరుకుంటూ రక్షా బంధన్ శుభాకాంక్షలు అలసిన వేళ అమ్మవై జోలపాడావ్.. అలిగిన వేళ అలక తీర్చి నాన్నవయ్యావ్.. చిరునవ్వును పంచి.. అనురాగాలకు అర్థం నేర్పి అన్నవయ్యావ్..
నీ చల్లని చూపే నాకు చాలు అన్నయ్యా..
రక్షా బంధన్ శుభాకాంక్షలతో.. నీ చెల్లెలు అన్నయ్యా..
చిరునవ్వుకు చిరునామావి మంచి మనసుకు మారురూపానివి మమతలకు ప్రాకారానివి ఆప్యాయతలకు నిలువెత్తు రూపానివి రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ చెల్లెలు..
ప్రియమైన అన్నయ్యా.. తనకన్నా మంచి మనసున్న నిన్ను చూసి ఆ దేవుడు చిన్నబోయాడు నీ చెల్లెలుగా మరో అవతారం ఎత్తాలనుకున్నాడు. మమకారానికి ఆకారమైన అన్నయ్యా.. నీకిదే నా అక్షర పుష్పాంజలి. ప్రేమతో.. నీ చెల్లెలు.
నీకెంత వయసొచ్చినా నా కంటికి చిన్న పిల్లవే.. కొండంత ప్రేమను పంచి నిండుగా దీవించే బంగారు చెల్లివే.. బుజ్జగింపు, ఊరడింపులు.. చిన్ననాటి మధుర స్మృతులను, తిరిగిరాని ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. మమతల మాగాణీలో పూసిన పువ్వులం స్నేహానురాగాలు నింపుకొన్న నవ్వులం అనురాగానికి ప్రతీకలం..
అనుబంధానికి ప్రతిరూపాలయిన అన్నాచెల్లెళ్లం చెల్లి నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి.. మనసే మధుమాసం మా చెల్లెమ్మ, ప్రేమే అనురాగం.. చిరునవ్వుల చెల్లెమ్మ, ఇంటికి అందం ముద్దుల చెల్లెమ్మ, నా కంటికి బంగారం మా చెల్లెమ్మ.. ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా ఇరిగిపోని గంధం, చెరగని గ్రంథం వసివాడని బంధం, మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.
అనుబంధాల హరివిల్లు ప్రేమాభిమానాల పొదరిల్లు గిల్లికజ్జాల సరదాలు తోడు నీడగా సాగిన జీవితాలు కాలం మారినా.. దూరం పెరిగినా.. చెరగని బంధాలు.. అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు.. కలకాలం నిలవాలి ఈ రక్షాబంధం ఒక్క తల్లి బిడ్డలం కాకపోయినా.. అంత కంటే ఎక్కువ అనురాగాన్ని పంచిన......
What's Your Reaction?






