అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం హర్షణీయం- రావుసుబ్రహ్మణ్యం
చిలకలూరిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం హర్షణీయం.. నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం

చిలకలూరిపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు గాంధేయవాది పొట్టి శ్రీరాములు అన్నారు.చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్య సంఘం అందిస్తున్న సేవలను కొనియాడారు.
రాజకీయాలకు అతీతంగా వారి ఆహ్వానం మేరకు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.19.06.2022 ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రావుసుబ్రహ్మణ్యం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత రాజమ్మ పాల్గొన్నారు.
What's Your Reaction?






