డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో 162 పడకల హాస్టల్‌ను క్రీడాశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రారంభించారు

డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ ప్రాంగణంలో క్రీడా హాస్టల్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రారంభించారు. ఈ హాస్టల్‌లో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో పాటు అటాచ్డ్ వాష్‌రూమ్ సదుపాయం ఉన్న 162 బెడ్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్ కండిషన్డ్ డైనింగ్ ఏరియా మరియు స్పోర్ట్స్ స్పెసిఫిక్ డైట్ కోసం సౌకర్యాలు కల్పించారు. బాలురు మరియు బాలికలకు ప్రత్యేక వినోద ప్రదేశం కూడా ఉంటుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 12.26 కోట్లు వ్యయం చేసింది.
శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, "మన అథ్లెట్లు ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు బస చేసే ప్రదేశంలో ప్రాథమిక సౌకర్యాలు ఉండాలి." అని చెప్పారు. అనుభవం ఉన్న నిపుణుల పర్యవేక్షణలో వారికి ఆహారం, ఆతిథ్యం మరియు పరిశుభ్రవాతావరణం ఉండే హాస్టళ్లు కనీసం 3 స్టార్ ప్రమాణాలతో ఉండాలి అని క్రీడా మంత్రి ప్రకటించారు. అలాగే వారికి సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక బాలికల హాస్టల్ మరియు ప్రత్యేక బాలుర హాస్టల్ ఉండాలి.. " షూటింగ్ ప్రాధాన్యత క్రీడ కావడంతో షూటర్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి."అని చెప్పారు.
ఇంతకుముందు షూటింగ్ రేంజ్ వెలుపల వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందుతున్న భారతీయ షూటర్లకు ఈ హాస్టల్ ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హాస్టల్‌లో షూటర్లకు కాస్త నడకదూరంలోనే వారి రైఫిల్, పిస్టల్ మరియు షాట్‌గన్ రేంజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
2018 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత అనీష్ భన్వాలా మాట్లాడుతూ “మాకు ఎప్పుడూ మంచి షూటింగ్ రేంజ్ ఉంది, కాని మాకు హాస్టల్ లేకపోవడం వల్ల ప్రాంగణం వెలుపల ఉండాల్సి వచ్చింది. హాస్టల్ ఇక్కడ ఉండటంతో మేము ఇప్పుడు ఉదయం మరియు మధ్యాహ్నం కూడా శిక్షణ పొందవచ్చు. ”అని చెప్పారు.
ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం సీనియర్ షూటర్ల గ్రూప్‌కే కాకుండా టాప్స్ డెవలప్మెంట్ గ్రూపులో భాగమైన షూటర్లకు మరియు ఖెలో ఇండియా పథకం మరియు ఎన్‌సివోఈ షూటర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
శ్రీ రిజిజు మాట్లాడుతూ, “షూటింగ్ అనేది ప్రస్తుతం ప్రధాన క్రీడలలో ఒకటి. షూటింగ్ క్రీడలో మాకు చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే దేశంలో అట్టడుగు స్థాయిలో కూడా ప్రతిభ కలిగి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్ నుండి మనకు గరిష్ట అర్హత ఉంది. ” అని తెలిపారు.
What's Your Reaction?






