మైనర్ బాలికపై అత్యాచారం - హత్యా నిందితుడు ను కఠినాతి కఠినం గా శిక్షించాలి - కొర్రపాటి సురేష్

వైజాగ్ దుర్ఘటన. బి.సి. సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని ఉరి తీయాలి. భాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఎంపీ, ఎమ్మెల్యే లతో చరవాణి లో కొర్రపాటి సురేష్

Oct 9, 2021 - 09:21
 0
మైనర్ బాలికపై అత్యాచారం - హత్యా నిందితుడు ను కఠినాతి కఠినం గా శిక్షించాలి - కొర్రపాటి సురేష్

:విశాఖపట్నం అగనంపూడి శనివాడలో ఒక అపార్ట్మెంట్ వాచ్ మెన్ కూతరు బిసి సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై మానవమృగాళ్ళు అత్యాచారం చేసి ముక్కు పచ్చలారని చిన్నారిని హత్య చేసిన ఘటనపై మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ వైజాగ్ పార్లమెంట్ సభ్యులు mvv సత్యనారాయణ,గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గార్లతో చరవాణిలో మాట్లాడారు.

బాధితురాలి కుటుంబానికి ముఖ్యమంత్రి ద్వారా సహాయం చేసి ఆదుకోవాలని అండగా నిలవాలని నిందితులను కఠినంగా శిక్షించేలా ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు .

ఈ సంధర్భంగా కొర్రపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపైనే కాక చిన్నారులపై కూడా మానవ మృగాళ్ళ చేస్తున్న ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యాచారాలు నియంత్రించేందుకు సూచనలు సలహాలతో లేఖ ద్వారా విన్నవించనున్నట్లు కొర్రపాటి తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow