డెంగ్యూ మృతులకు 10లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించాలి - కొర్రపాటి సురేష్

Sep 20, 2021 - 19:07
Sep 21, 2021 - 09:07
 0
డెంగ్యూ మృతులకు 10లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించాలి - కొర్రపాటి సురేష్

డెంగ్యూ మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించాలి మాలమహానాడు డిమాండ్ : డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ సోమవారం పత్రికా ప్రకటన లో డిమాండ్ చేశారు.

ఈ సంధర్భంగా కొర్రపాటి మాట్లాడుతూ ఇటీవల పెదకాకాని లూథర్ గిరి కాలనీలో 8ఏళ్ళ బాలుడు డెంగ్యూ తో మృతి చెందాడని ఉన్నత అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు కానీ కుటుంబాన్ని సందర్శించలేదని ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నా పారిశుధ్యం పనులు నామమాత్రం గానే సాగుతున్నాయని.

ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వాడలలో సక్రమ డ్రైనేజీ రోడ్లు లేకపోవడంతో ఇటువంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ప్రకటించి గ్రామాలలో మునిసిపాలిటీలు కార్పోరేషన్లలో కాలువల శానిటైజేషన్ మరియు దోమల మందు ప్రతి రెండు రోజులకు పిచికారీ చేయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహించి పేద ప్రజల ప్రాణాలు కాపాడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి చర్యలు తీసుకోవాలని కొర్రపాటి తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow