జనసేన PAC సభ్యులు కొణిదెల నాగబాబు గారితో రైల్వే కోడూరు జనసేన నాయకులు - మర్రి రెడ్డిప్రసాద్

ఈరోజు హైదరాబాద్ జనసేన సెంట్రల్ ఆఫీస్ లో జనసేన PAC సభ్యులు కొణిదెల నాగబాబు గారితో రైల్వే కోడూరు జనసేన నాయకులు

జనసేన  PAC  సభ్యులు   కొణిదెల నాగబాబు గారితో రైల్వే కోడూరు జనసేన నాయకులు - మర్రి రెడ్డిప్రసాద్

కోడూరు జనసేన నియోజకవర్గ అభివృద్ది,పటిష్టత, జనసైనికులు చేస్తున్న పోరాటాలు గురించి  క్షుణ్ణంగా నాగబాబు గారికి  వివరించడం జరిగింది. పార్టీ అభివృద్ధి కోసం పటిష్టత కోసం కష్టపడే ఏ ఒక్కరికీ పార్టీ  అన్యాయం చేయబోదని ప్రజా సేవే పరమావధిగా జనసేన జెండాతో పోరాటాలు చేసే ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని, నాగబాబుగారు  హామీ ఇవ్వడం జరిగింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయమే పరమావధిగా  ప్రతి ఒక్కరూ మరింత గా కష్టపడాలని. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన విషయంలో పార్టీ అధిష్టానం పటిష్టమైన సమాచారంతో అందరికీ ఆమోదయోగ్యమైన  అభ్యర్థులనే బరిలోకి దింపుతారని 

పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవడమే జనసేన పార్టీ ధ్యేయంగా  ప్రతి ఒక్కరూ సమర శంఖారావం పూరించాలని  అక్టోబర్  నెలలో విజయదశమి రోజున  ప్రారంభించే పవన్ కళ్యాణ్ గారి యాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని  ఈ సందర్బంగా  నాగబాబు గారు  తెలుపడం జరిగింది  .

రైల్వే కోడూరులో జనసైనికులు చేస్తున్న అద్భుతమైన జనసేన పోరాటాల గురించి ఆయన విన్నతరవాత  హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

 ప్రజాసేవే పరమావధిగా ఇలాంటి పోరాటాలు కొనసాగించాలని ఆయన కోరడం జరిగింది  .

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్ , అంకిశెట్టి మణి, వర్ధన గారి ప్రసాద్, జంపన్న, జనసేన దళిత నాయకుడు నగిరి పాటి మహేష్, పాల్గొన్నారు  .