కొత్త బడ్జెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థకు వివిధ కొత్త పథకాలు ఉన్నాయి: డాక్టర్ హర్ష్ వర్ధన్

శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ,

Feb 16, 2021 - 15:27
 0
కొత్త బడ్జెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థకు వివిధ కొత్త పథకాలు ఉన్నాయి: డాక్టర్ హర్ష్ వర్ధన్
There are various new schemes in this new budget which would further boost Science and Technology ecosystem in the country: Dr Harsh Vardhan

సైన్స్టెక్నాలజీ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలకు బడ్జెట్ 2021 చోటు కలిపించింది. జాతీయ ప్రాధాన్యతలను గుర్తించిన కీలక రంగాలలో పరిశోధన మరియి అభివృద్ధి (ఆర్‌ అండ్ ‌డి) కి ప్రాధాన్యతను గణనీయంగా పెంచడానికి ఈ బడ్జెట్ ముందడుగు వేసింది. ఇవి వివిధ వర్గాలతో సంప్రదింపులకు అనుగుణంగా కోసం రూపొందించిన ముసాయిదా సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2021 లోని అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి.

నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం 5 సంవత్సరాలలో మొత్తం రూ .50,000 కోట్లు కేటాయించడంవిశ్వవిద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎస్ అండ్ టి అనేక అంశాల్లో పనిచేసే పరిశోధకులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన స్వయంప్రతిపత్త సంస్థ. గుర్తించబడిన జాతీయ-ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించి దేశం మొత్తం పరిశోధన పర్యావరణ వ్యవస్థ బలోపేతం అయ్యేలా ఇది నిర్ధారిస్తుంది.

ఆరోగ్యకుటుంబ సంక్షేమంసైన్స్ టెక్నాలజీఎర్త్ సైన్సెస్ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే 2021-22 సంవత్సరానికి సైన్స్ అండ్ టెక్నాలజీఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కలిపి బడ్జెట్‌లో 30 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత సంవత్సరం చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని కోవిడ్-19 వల్ల కలిగే వివిధ సమస్యలను పరిష్కరించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కొత్త బడ్జెట్‌లో దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను మరింత పెంచడానికిప్రజలకు దాని ప్రయోజనాలను చేరుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఎస్ అండ్ టిలో దేశం ఒక ప్రధాన శక్తిగా మారడానికి సహాయపడే వివిధ కొత్త పథకాలు ఉన్నాయిఅని కేంద్ర మంత్రి అన్నారు.

సముద్ర వనరులను మ్యాపింగ్అన్వేషించడం మరియు ఉపయోగించుకోవడంలో అసాధారణమైన అవకాశాలను అందించే ఈ కొత్త రంగాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఐదేళ్లలో 4,000 కోట్లకు పైగా వ్యయంతో డీప్ ఓషన్ మిషన్ ప్రారంభించినట్లు బడ్జెట్ ప్రకటించింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సమన్వయం చేయబోయే మిషన్ డీప్ ఓషన్ సర్వేసముద్ర వనరుల అన్వేషణ మరియు వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధితో పాటు లోతైన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ మరియు బయో-ప్రాస్పెక్టింగ్ కోసం ప్రాజెక్టులను కలిగి ఉంటుంది.

ఆర్ ‌అండ్ ‌డి సంస్థలువిశ్వవిద్యాలయాలుప్రభుత్వం మద్దతు ఇచ్చే కళాశాలల మధ్య మెరుగైన సమన్వయం పెంపొందించడానికి తొమ్మిది నగరాల్లో గొడుగు నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించింది. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది మరియు ఈ ప్రయోజనం కోసం గ్లూ గ్రాంట్ కేటాయించబడుతుంది. ఫిబ్రవరి 2020 లో బడ్జెట్ ప్రకటన ప్రకారం 10 ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్న యుఆర్జిఐటి క్లస్టర్లను (యూనివర్శిటీ రీసెర్చ్ జాయింట్ ఇండస్ట్రీ ట్రాన్స్లేషన్ క్లస్టర్స్) బయోటెక్నాలజీ విభాగం అమలు చేస్తోంది. ఇవి గొడుగు నిర్మాణాల కార్యకలాపాలను పూర్తి చేస్తాయి.

ఒక జాతీయ భాషా అనువాద మిషన్ (ఎన్‌ఎల్‌టిఎమ్) ప్రకటించడం అయిందిఇది సాంప్రదాయ పద్ధతులతో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత యంత్ర అనువాదం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన భారతీయ భాషలకు ఇంటర్నెట్‌లోని పాలన-మరియు విధాన సంబంధిత జ్ఞాన సంపదను అనువదించడానికి వీలు కల్పిస్తుంది.

హరిత విద్యుత్ వనరుల నుండి హైడ్రోజన్ ఉత్పత్తిదాని నిల్వరవాణా మరియు వినియోగం కోసం కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించినట్లు ప్రకటించారు. బయోటెక్నాలజీ విభాగం బయోమాస్ టు హైడ్రోజన్ మిషన్‌ను అభివృద్ధి చేస్తోందిఇది పరిశోధన అభివృద్ధి కోణం నుండి ముఖ్యమైనది. సైన్స్ టెక్నాలజీ విభాగం మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కూడా ఈ మిషన్‌కు తోడ్పడతాయి.

సైన్స్ మంత్రిత్వ శాఖలు సాధించిన విజయాలను వివరిస్తూసైన్స్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, “పిహెచ్ .డిలుఉన్నత విద్యావ్యవస్థ పరిమాణంతో పాటు స్టార్టప్‌ల సంఖ్యను బట్టి శాస్త్రీయ ప్రచురణలో ప్రపంచంలో భారతదేశం 3 వ స్థానంలో నిలిచిందిప్రపంచవ్యాప్తంగా టాప్ 50 వినూత్న ఆర్థిక వ్యవస్థలలో గుర్తింపు పొందింది. మొత్తం మీదమనం సకారాత్మక రీతిలో ఊర్ధ్వ గమనం సాగిస్తున్నాం " అన్నారు.

వాతావరణ అంచనాలో మెరుగుదలలుభారతదేశ వ్యవసాయ శ్రామిక శక్తి మరియు మత్స్యకారుల వర్గాలకు లాభాలు మరియు లక్షద్వీప్ దీవులకు తాగునీరుఉష్ణమండల తుఫానుల యొక్క ఖచ్చితమైన అంచనా మరియు విపత్తు నిర్వహణ సంస్థల క్షేత్రస్థాయి పనిపట్టణ వరద ముందస్తు హెచ్చరిక ముంబైలో వ్యవస్థనార్త్ వెస్ట్ ఇండియాపై డాప్లర్ వెదర్ రాడార్ల పెరుగుదల మరియు ఢిల్లీకి అధిక రిజల్యూషన్ కలిగిన కార్యాచరణ గాలి నాణ్యత సూచన నమూనా గురించి ఎంఓఈఎస్ కార్యదర్శి  డాక్టర్ ఎం.రాజీవన్ ప్రసంగించారు.

బయో-టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్డిఎస్ఐఆర్ కార్యదర్శిసిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే కూడా ఈ సందర్బంగా ప్రసంగించారు. 

*****

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow