స్త్రీ మూర్తుల ఆరోగ్యం కోసం MDN NEWS ప్రత్యేకం

Jan 5, 2021 - 09:15
Jan 6, 2021 - 22:05
 0
స్త్రీ మూర్తుల ఆరోగ్యం కోసం MDN NEWS ప్రత్యేకం
ladies pms problem mdn news telugu menstrual cups how to use menstrual cup telugu

[ఇది/ఈ క్రింది సమాచారం కేవలం - సాధారణ అవగాహన కోసం మాత్రమే - సమస్యలు లక్షణాలు అనేవి వ్యక్తి కి వ్యక్తి కి మారుతాయి . పూర్తి స్థాయి అవగాహన కోసం మీ దగ్గరలో ని ప్రభుత్వ ఆసుపత్రి ని కానీ లేక దగ్గర లోని వైద్యులను సంప్రదించండి.]

మెనుస్ట్రువల్ కప్ ఎలా వాడాలి.. దీని వల్ల లాభాలేంటంటే. (how to use Menstrual Cup- advantages of using menstrual cup telugu )

మెనుస్ట్రువల్ కప్.. ఇది ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్. రబ్బర్ తో గానీ, సిలికాన్‌తో తయారు చేసే ఈ కప్‌ని పీరియడ్స్‌ టైమ్‌లో వాడుతారు.

ఈ మెనుస్ట్రువల్ కప్పు , సాధారణ మైన ప్యాడ్, బట్ట లాంటి వాని కంటే ఎక్కువ బ్లీడింగ్‌ ను కంట్రోల్ చేయగలదు. పీరియడ్ ఫ్లో ఎక్కువ ఉన్న వారు దీన్ని పన్నెండు గంటల వరకూ కూడా వాడచ్చు. అందుకే చాలా మంది టాంపున్స్ , నాప్కిన్స్ కంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత  చేస్తారు.ఎలా వాడాలంటే. మెనుస్ట్రువల్ కప్‌ని వాడాలనుకుంటే,  మీరు ముందు ఓసారి మీ గైనకాలజిస్ట్ (డాక్టరు గారితో ) తో మాట్లాడడండి.. అప్పుడు మీకు ఏ సైజ్ లో కొనుక్కోవాలో తెలుస్తుంది. మార్కెట్లో దొరికే చాలా బ్రాండ్స్ స్మాల్, లార్జ్ వెర్షన్స్ రెండింట్లోనూ దొరుకుతున్నాయి. వీటిని మీరు ఆన్లైన్ లో కానీ, ఏదైనా స్టోర్ లో కానీ కొనుక్కోవచ్చు.

((కొన్ని నాణ్య మైన - చౌకైన - ఉత్తమ కప్పుల వివరాలు మరియు వాటి ఖరీదును - ఇక్క భవిష్యత్తు లో అప్డేట్ చేస్తాము(డాక్టరు గారి సలహాతో మాత్రమే )- చూస్తూ ఉండండి .))

సరిపోయే కప్ గురించి ఎలా తెలుసుకోవాలంటే..

అదే విధంగా మెనుస్ట్రువల్ కప్ మనకి ఏది సరిపోతుందో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలి. అవి
- మీ వయసు
- మీ సర్విక్స్ లెంత్
- మీ పీరియడ్ ఫ్లో
- కప్ కి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ
- కప్ కెపాసిటీ
- మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి
- మీది నార్మల్ డెలివరీనా కాదా

ముప్పై ఏళ్ళ కంటే చిన్న వాళ్ళకీ, నార్మల్ డెలివరీ కాని వారికీ స్మాల్ కప్ సజెస్ట్ చేస్తారు. ముప్పరై ఏళ్ళు పైబడిన వారికి, నార్మల్ డెలివరీ అయిన వారికీ, హెవీ పీరియడ్ ఉన్న వారికీ లార్జ్ కప్ సజెస్ట్ చేస్తారు.

మీరు పీరియడ్ కప్ ని మొదటి సారి యూజ్ చేస్తున్నప్పుడు కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కప్ కొంచెం తడి గా ఉంటే ప్రాసెస్ స్మూత్ గా ఉంటుంది. అందుకని ఈ కప్ ని ఇన్సర్ట్ చేసుకునే ముందు నీటితో కడగడం కానీ, వాటర్ బేస్డ్ లూబ్రికెంట్‌ రాయడం కానీ చేయండి. అప్పుడు అది ఈజీ గా ఇన్సర్ట్ అవుతుంది. టాంపూన్స్ వాడిన వారికి ఇది అంత కష్టం కాకపోవచ్చు. ఒకవేళ టాంపూన్స్ వాడి ఉండకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా.

1. చేతులు శుభ్రంగా కడుక్కోండి.

2. కప్ అంచుని నీటితో కానీ, వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ తో గానీ తడపండి.

3. అంచు పైకి వచ్చేలాగా ఈ కప్ ని ఒక చేత్తో గట్టిగా మడిచి పట్టుకోండి.

4. ఇప్పుడు ఈ కప్ ని నెమ్మదిగా వజైనా లోపలికి ఇన్సర్ట్ చెయ్యండి. మీ సర్విక్స్ కంటే కిందగా ఉండాలి ఇది.

5. ఒకసారి కప్ లోపలికి ఇన్సర్ట్ చేసిన తరువాత దాన్ని రొటేట్ చెయ్యండి. అప్పుడొక ఎయిర్-టైట్ సీల్ ఏర్పడి ఎలాంటి లీక్ లేకుండా ఉంటుంది.

మీరు దాన్ని సరిగ్గా ఇన్సర్ట్ చేసి ఉంటే మీరు ఆ కప్ ని అసలు ఫీల్ అవ్వకూడదు. లోపల ఏదో ఉందని మీకు అనిపించదు. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ - కదలడం, కూర్చోడం, నడవడం, జంప్ చేయడం, పడుకోవడం, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి ఈజీగా చేయగలుగుతారు. అప్పుడే మీరు కప్ ని సరిగ్గా ఇన్సర్ట్ చేసుకున్నట్లు. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే మీ డాక్టర్ తో ఒకసారి మాట్లాడండి.

కప్పు ని ఎప్పుడు బయటికి

మీ పీరియడ్ ఫ్లో ని బట్టి మీరు ఈ కప్ ని ఆరు నించి పన్నెండు గంటల వరకూ ఉంచచ్చు. ఈ కప్ ని మీరు రాత్రంతా కూడా వాడచ్చు. కానీ, మాగ్జిమం పన్నెండు గంటల పాటే ఈ కప్ ని లోపల ఉంచాలి. ఒకవేళ ఈ లోపే ఈ కప్ నిండిపోతే పన్నెండు గంటల లోపే తీసెయ్యాలి. లేకపోతే లీక్ అవుతుంది.కప్‌ని బయటికి తీసేటప్పుడు..

1. చేతులు శుభ్రం గా కడుక్కోండి.

2. మీ బొటన వేలు, చూపుడు వేలు ని వజైనా లోకి పెట్టండి. కప్ కింద పొడుగ్గా ఉండే భాగాన్ని పట్టుకుని మీ వేళ్ళకి బేస్ తగిలే వరకూ నెమ్మదిగా లాగండి.

3. బేస్ ని గట్టిగా నొక్కితే సీల్ ఓపెన్ అవుతుంది.

4. నెమ్మదిగా కప్ కిందకి లాగేయండి.

5. కప్ బైటికి వచ్చేసిన తరువాత అందులో ఉన్న బ్లడ్ ని టాయిలెట్ లో ఒంపెయ్యండి.

కప్పు ‌ క్లీన్

రీయూజబుల్ మెన్స్ట్రువల్ కప్ శుభ్రంగా కడిగేసి, తుడిచేసిన తరవాతే మళ్ళీ యూజ్ చేయొచ్చు. రోజుకి కనీసం రెండు సార్లైనా మీరు కప్ మార్చాలి. జాగ్రత్తగా వాడుకుంటే ఈ కప్పులని అత్యధికంగా పదేళ్ళ వరకూ కూడా వాడవచ్చును. డిస్పోజబుల్ కప్పులు అయితే తీసేయగానే పారెయ్యాలి.

కప్పు  వల్ల లాభాలు.. (advantages of menstrual cups - )

1. రీయూజబుల్ కప్ ఒక్కసారే కొంటారు. టాంపూన్లు కానీ, నాప్కిన్లు  గానీ ఎప్పుడూ కొంటూనే ఉండాలి.

2. టాంపాన్స్ వాడడం కంటే కప్ వాడడం సురక్షితం.

3. నాప్కిన్స్, టాంపూన్స్ కంటే ఈ పీరియడ్ కప్ ఎక్కువ బ్లడ్ ని హోల్డ్ చేస్తుంది.

4. రీయూజబుల్ మెనుస్ట్రువల్ కప్ వాడడం ఒక మంచి ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్.

5. రీయూజబుల్ కప్స్ ని సెక్స్ కి ముందు బయటికి తీసెయాలి. కానీ, సాఫ్ట్ డిస్పోజబుల్ కప్ సెక్స్ టైం లో కూడా వాడొచ్చు. మీ పార్ట్నర్ కి మీ కప్ విషయం కూడా తెలీదు, మీరు లీక్స్ గురించి వర్రీ అవ్వక్కర్లేదు.

6. మెన్స్ట్రువల్ కప్ ని కాపర్-టీ తో పాటు వాడుకోవచ్చు. అయితే ఒక్కసారి ఈ విషయం మీ డాక్టర్ తో సంప్రదించడం మంచిది.

సమస్యలు..

1. కప్ ని తియ్యడం కొద్దిగా జుగుత్సా కరం గా ఉండొచ్చు. సరైన ప్రదేశంలో సౌకర్య వంతంగా కప్పు తియ్యలేకపోతే చుట్టూ రక్తం పడొచ్చు.

2. ఈ కప్పు ని ఇన్సర్ట్ (ధరించడం) చెయ్యడం, రిమూవ్(తీసి వేయడం ) చెయ్యడం అందరికీ అంత సునాయాసం గా అనిపించకపోవచ్చు.

3. సరైన సైజ్ దొరకడం కష్టం కావచ్చు. అంటే, మీకు సరిపోయే కప్ దొరికెంతవరకూ మీరు డిఫరెంట్ బ్రాండ్స్, సైజెస్ వాడాల్సి వస్తుంది.

4. కొంతమందికి ఇందులో వాడిన సిలికాన్, రబ్బర్ వల్ల ఎలర్జీ రావచ్చు.

5. ఈ ప్రాసెస్ లో ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా వజైనల్ ఇన్‌ఫెక్షన్ రావచ్చు.

ఈ కప్ ని యూజ్ చేయడంలో ఉన్న అడ్వాంటేజెస్, డిస్ అడ్వాంటేజెస్ గురించి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. అయినా కూడా మీకు క్లియర్ గా అనిపించకపోతే మీ గైనకాలజిస్ట్ తో ఒకసారి మాట్లాడండి.

ఋతుచక్రం

ఋతుచక్రం (Menstrual cycle) స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఋతుచక్రాన్ని బహిష్టు, నెలసరి అని కూడా అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.

ఋతుచక్ర నియమాలు నాడు - నేడు

ఋతు చక్ర సమయంలో చెడురక్త విసర్జన వల్ల శరీరంనుండి దుర్గందం వస్తుంది, ఫలితంగా ఆడపిల్లలు బలహీనంగా, ప్రవర్తనలో చికాకుగా ఉంటారు. అందువల్ల పూర్వం ఇలా నెలసరిలో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ఇంటి అరుగుపై చాప వేసి దానిపై కూర్చోబెట్టేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. బహిష్టు సమయంలో ఆహారంగా అన్నంలో పప్పు - నెయ్యి మాత్రమే తినేవారు. బహిష్టు స్నానం పూర్తి కాగానే గర్భ దోషాలు నివారించబడటానికి గోళీకాయంత పసుపు ముద్ద మ్రింగేవారు. గర్భ దోషాలు ఉండేవి కావు. కాని నేడు స్త్రీ సాధికారత వల్ల, పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల అమ్మాయిలు బహిష్టు నియమాలను ఉల్లఘించడం జరుగుతోంది. ఫలితంగా బహిష్టు నొప్పులు, గర్భస్రావాలు జరుగుతున్నాయి.

నెలసరి నేప్కిన్లు

గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో నెలసరి సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం రుతుక్రమం వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లను (ముట్టు బట్టలు, ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.

పి.ఎమ్.ఎస్. (ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్) (Pre-menstrual Syndrome)

ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్:- అనేది ఒక వ్యాధి కాదు, నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరు ఐచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా, నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాధారణంగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.

బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,

జీర్ణకోసానికి సంబంధించి .. మలబద్దకము, విరేచనాలు, వాంతులు, వగైరా,

పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,

వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,

కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు,

తీపి తినాలనిపించడము.

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని, ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిధ్యముగల లక్షణాలున్న ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని, అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని, ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.బహిష్టు కాలంలో నొప్పి ఎర్రబట్ట, తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( సోమిద ) చెక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటారు.

జాగర్తలు [ఇది/ఈ క్రింది సమాచారం కేవలం - సాధారణ అవగాహన కోసం మాత్రమే - సమస్యలు లక్షణాలు అనేవి వ్యక్తి కి వ్యక్తి కి మారుతాయి . పూర్తి స్థాయి అవగాహన కోసం మీ దగ్గరలో ని ప్రభుత్వ ఆసుపత్రి ని కానీ లేక దగ్గర లోని వైద్యులను సంప్రదించండి.]

మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.

క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.

క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.

కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.

నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.

లక్షణాలు

పి.ఎమ్.ఎస్.తో 200 కన్నా ఎక్కువ లక్షణాలు అనుసంధానం అయ్యి ఉన్నాయి.శృంగార ఆసక్తిలో మార్పులు, భావావేశపూరిత సున్నితత్వం పెరుగుట, అలసట, తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, ఆతృత, ఒత్తిడి వంటి భావావేశపూరిత, నిశ్చిత లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.

నడుమునొప్పి, ఉదారపు తిమ్మిరి, మలబద్ధకం/అతిసారం, వక్షస్తలం వాయటం లేదా తాకితే నొప్పి పుట్టడం, ఆవృత మొటిమలు, కీలు లేదా కండరాలు నొప్పులు, తిండి కొరకు తీవ్రవాంఛ వంటి ఋతుచక్ర సంబంధిత శారీరక లక్షణాలు దీనికి అనుసంధానం అయి ఉన్నాయి.కచ్చితమైన లక్షణాలు, వాటి తీవ్రత ఒక మహిళ నుండి మరొక మహిళ కు, కొంతమట్టుకు చక్రం నుండి చక్రానికి, కాలమును అనుసరించి అర్ధవంతంగా మారుతూ ఉంటాయి.బహిష్టుపూర్వ సంలక్షణం కలిగిన ఎక్కువ మహిళలు సాపేక్షముగా పూర్వానుమేయ ఆకృతిలో కొన్ని సంభావ్య లక్షణాలను మాత్రమే అనుభవిస్తారు.

కారణాలు

పి.ఎమ్.ఎస్. అనేది లూటీల్ దశకు అనుసంధానం అయ్ ఉన్నప్పుడు పి.ఎమ్.ఎస్.కారణాలు అనేవి స్పష్టానంగా ఉండవు కానీ చాలా రకాల కారణాలను కలిగి ఉండచ్చు.ఋతుచక్ర సమయంలో హార్మోన్లలో మార్పులు అనేవి ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తాయి.మెదడులోని రసాయనాల మార్పు, ఒత్తిడి, దుఃఖం వంటి భావావేశపూరిత సమస్యలు పి.ఎమ్.ఎస్.ని కలగజేయవు కానీ ఇంకా అధికం చేస్తాయి.తక్కువ స్థాయి విటమిన్లు, మినరల్ లు, అధిక స్థాయి సోడియం, మద్యం, /లేదా కాఫిన్ అనేవి నీటి నిలుపుదల వంటి లక్షణాలు అధికం చేస్తాయి.పి.ఎమ్.ఎస్.అనేది కనీసం ఒక బిడ్డను కలిగిన, దుఃఖం అనేది కుటుంబ వారసత్వపరంగా కలిగిన, గతంలో ప్రసవానంతరం రక్తస్రావం వంటి బాధ గాని లేక మానసికావస్థ యొక్క అనారోగ్యం వంటి ఆరోగ్యచరిత్ర కలిగిన 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలలో ఎక్కువగా కనపడుతుంది.

రోగనిదానం

పి.ఎమ్.ఎస్. రోగనిదానమును నిరూపించుటకొరకు లాబొరేటరీ పరీక్షలు గాని లేదా ప్రత్యేకమైన భౌతికంగా కనుగొన్న విషయం గాని లేవు.మూడు ముఖ్యమైన అంశాలు:

మహిళ యొక్క ముఖ్యమైన ఫిర్యాదు ఏమనగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పి.ఎమ్.ఎస్.తో అనుసంధానం అయ్ ఉన్న భావావేశపూరిత లక్షణాలు (అధిక చిహ్నముగా క్షోభ్యత, ఉద్రిక్తత లేదా దుఃఖం). మహిళ తిమ్మిరి వంటి శారీరక లక్షణాలు మాత్రమే కలిగి ఉండి పి.ఎమ్.ఎస్. లేకపోవుట.

లక్షణాలు అనేవి లూటీల్ (బహిష్టుపూర్వ) దశ సమయమున పూర్వానుమేయముగా కనపడతాయి, ఋతు సమయమున లేదా అంతకంటే కొద్దిగా ముందు పూర్వానుమేయముగా మాయం అయిపోతాయి లేదా తగ్గిపోతాయి, ఫోలిక్యూలర్ (ప్రీ ఒవ్యులేటరీ) దశయందు అనుపస్థితమయి ఉంటాయి. లక్షణాలు అనేవి మహిళ యొక్క రోజువారీ జీవితంలో కలగజేసుకునేంత తీవ్రంగా ఉండకూడదు . ఒక వేళా అలా ఉంటె కనుక త్వరిత గతిన వైద్యులను సంప్రదించాలి . 

స్వల్పమైన పి.ఎమ్.ఎస్. అనేది సహజం, మరికొన్ని తీవ్ర లక్షణాలు పి.ఎమ్.డి.డి. (ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్) గా పరిగణించబడతాయి.ఒక పద్ధతిని ఏర్పరిచి అది పి.ఎమ్.డి.డి. అని నిర్ధారించుకొనుట కొరకు, ఆ మహిళ యొక్క వైద్యురాలు ఆమెను కనీసం తన రెండు ఋతుచక్రాల పాటు తన లక్షణాలను ఒక క్యాలెండర్ మీద ఒక భావి లేఖ్యము పెట్టుకోవలసిందిగా అడగవచ్చు. లక్షణాలు అనేవి వాస్తవమా, బహిష్టుపూర్వ సమయముకు పరిమితమయి ఉన్నాయా, పూర్వానుమేయముగా పునరావృతం అవుతున్నాయా, సాధారణ నిర్వహణకు నిర్మూలం అయ్యాయా అని తెలుసుకొనుటకు ఇది ఉపయోగపడుతుంది. కేలండర్ అఫ్ ప్రీ మెన్స్ట్రుల్ సిండ్రోమ్ ఎక్స్పీరియన్సెస్ (సి.ఓ.పి.ఈ.), ప్రాస్పెక్టీవ్ రికార్డ్ అఫ్ ఇంపాక్ట్ అండ్ సెవెయారిటీ అఫ్ మెన్స్ట్రుయేషన్ (పి.ఆర్.ఎస్.ఎమ్.), విజువల్ అనలాగ్ స్కేల్స్ (వీ.ఏ.ఎస్.) వంటి మొదలైన ప్రమాణీకరించబడిన పరికరాలు పి.ఎమ్.ఎస్.ను వివరించటానికి అభివృద్ధి చేయబడ్డాయి.

లక్షణాలను మెరుగుగా వివరించే వేరే దశలను బహిష్కరించాలి.మెన్స్ట్రువల్ మాగ్నిఫికేషన్ అను పద్ధతి ప్రకారం మెన్స్ట్రుయేషన్ యందు చాల రకాల ఆరోగ్య స్థితులు వ్యాధి ప్రకోపానికి గురి చేయబడతాయి.మూలాధారమైన అనారోగ్యం పాండురోగం, థైరాయిడ్ గ్రంథి మాంద్యం, తినటంలో అవ్యవస్థ, పదార్థ దుర్వినియోగం అయినా సరే ఈ పరిస్థితులు మహిళను తనకు పి.ఎమ్.ఎస్. ఉన్నట్టు నమ్మేలా చేస్తాయి.ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ దశలు లూటీల్ దశకు బయట అయినా ఉండచ్చు.బహిష్టుపూర్వకంగా వృద్ధి చేయదగిన దశలు దుఃఖం లేదా వేరే భావనాత్మక అవ్యవస్థలు, పార్శ్వం నొప్పి, బలాత్కార స్వాధీన అనారోగ్యం, అలసట, పేగు చిటపటలాడు సంలక్షణం, ప్రతికూలతలను కలిగిఉంటాయి.స్త్రీ జననమండలం యొక్క బహిష్టు వేదన (ఋతుసమయమున, అంతకంటే ముందే కలిగే నొప్పి), ఎండోమెట్రియోసిస్, పెఱిమెనోపాస్, మౌఖిక గర్భనిరోధక మాత్రలు కలగజేసే వ్యతిరేక ప్రభావాలు వంటి వేరే రీతులను బహిష్కరించాలి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీసెర్చ్ యొక్క నిర్వచనం ఋతుచక్ర సమయం ప్రారంభానికి ముందు లక్షణాల యొక్క తీవ్రతను 5 నుంచి 10 చక్రం రోజులను ఆరు రోజుల వ్యవధికి పోల్చుతుంది.పి.ఎమ్.ఎస్.గా నిర్ధారణ అవ్వుట కొరకు లక్షణాల తీవ్రత అనేది ఋతువుకు ఆరు రోజుల ముందు కనీసం 30% పెరగాలి.అధనంగా, ఈ ఆకృతిని కనీసం రెండు నిరంతర ఋతుచక్రాలపాటు లిపిబద్దీకరణ చేయాలి.

నిర్వహణ

పి.ఎమ్.ఎస్.లో చాలా ట్రీట్మెంట్లు ప్రయత్నించబడ్డాయి.స్వల్ప లక్షణాలు కలవారికి వ్యాయామం పెంచటంతో పాటు ఉప్పు, కాఫిన్, ఒత్తిడి తగ్గించుట అనేది ఆనవాలుగా సిఫార్సు చేయబడతాయి.కొన్నిట్లో కాల్షియమ్, విటమిన్-డి కలపడం అనేవి ఉపయోగబడతాయి.నాప్రోక్సీన్ వంటి శోథ నిరోధకాలు శారీరక లక్షణాలకు ఉపయోగబడతాయి.మరికొన్ని భావసూచికమైన లక్షణాలు ఉన్నవారికి సంతాననిరోధమాత్రలు ఉపయోగబడతాయి.

నీటినిరోధమును వ్యవహరించుటకు మూత్రకారకులను ఉపయోగించటమైనది.స్పిరోనోలాక్టోనే అనేది కూడా ఉపయోగబడుతుంది అని కొన్ని అధ్యనాలలో చూపబడింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow