అనాథ శవాన్ని మోసుకుంటూ 2 కిమీ నడిచి- మహిళా ఎస్సై

గుర్తు తెలియని మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ 2 కిమీ నడిచి గమ్యానికి చేర్చారు - మహిళా ఎస్సై -కొత్త శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.

అనాథ శవాన్ని మోసుకుంటూ 2 కిమీ నడిచి- మహిళా ఎస్సై
kotha sirisha police the celebrity

పోలీస్వి ది సెలబ్రిటీ :- వివరాల్లోకి వెళితే.. ఒకటో వార్డులో ఉన్న అడవి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కాశిబుగ్గ ఎస్సై కొత్త శిరీష సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలో మీటర్ వరకు  మోసుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక.. దాని నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు.. మహిళా ఎస్సై మంచి మనస్సును అభినందిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు జవాబుదారీ ఉండడం పోలీస్ కర్తవ్యం. సమాజ పరిరక్షణకు కూడా పోలీసులు చేస్తారని తెలుసు. మహిళా పోలీసులు ఎవరు కూడా ఇలాంటి సేవలు చేయలేదు. మీకు సెల్యూట్ .అంటూ ప్రశంసిస్తున్నారు .

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది ట్వీట్ ను చూడండి