క్యాలెండర్ ఆవిష్కరణ - భావోద్వేగానికి లోనైన జీఎంసీ సిబ్బంది

Jan 23, 2021 - 16:42
Jan 25, 2021 - 11:01
 0
క్యాలెండర్ ఆవిష్కరణ - భావోద్వేగానికి లోనైన  జీఎంసీ సిబ్బంది
gmc municipal employees calender release.

Guntur:AP:IND:TEL: 23/01/2021:- క‌రోనాపై పోరాటం స‌మ‌యంలో ప్రజలకు సేవ చేయడం లో మన జీ. ఎం. సీ.  సిబ్బంది బ‌ల‌మైన, నిస్వార్ధ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించార‌ని నగర పాలక సంస్థ కమిషనర్  శ్రీ అనురాధ కొనియాడారు. మన గుంటూరు నగర పాలక  సిబ్బంది, క‌రోనా వ‌చ్చిన తొలి రోజుల‌లో ఈ వ్యాధి బారిన ప‌డిన త‌మ వారిని కూడా క‌లుసుకోలేని నిస్స‌హాయ ప‌రిస్థితి, అయోమ‌య ప‌రిస్థితిని ఎదుర్కొన్న రోజుల‌ను గుర్తు చేసుకుని అధికార సహోద్యోగుల సమేతం గా నగర పాలక సంస్థ కమిషనర్  బాధాత‌ప్త హృద‌యంతో గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ -శ్రీ పి . నమ్రత్ మాట్లాడుతూ

దేశ  వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, క్యాలెండర్ ఆవిష్కరణలు, జనవరి మొదటి రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే - కానీ ఎల్లపుడూ ప్రజా సేవ లో ఉంటూ , నగర ప్రజల సౌకర్యాలకు ఆటంకం కలుగ కుండా చూస్తూ, అదే సమయం లో ఎన్నికల తంతు, కోవిడ్ విధులు, నిబంధనలు, పేదలకు పట్టాల పంపిణి తదితర హడావిడిల కారణంగా మన (జీఎంసీ ) క్యాలెండర్ ఆవిష్కరణ స్వల్ప ఆలస్యం అయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము.

భావోద్వేగంతో హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపిన- నమ్రత్ .

 దేశ‌వ్యాప్తంగా  కోవిడ్ -19 వాక్సిన్ కార్య‌క్ర‌మం ప్రారంభం అయినా సంగతి విదితమే, మనమందరం ఇదే స్పూర్తితో ప్రభుత్వం చేపట్టిన ఈ వాక్సినేషన్ ను కూడా అంకిత భావంతో పూర్తి చేద్దాము. గ‌డిచిన సంవ‌త్స‌రంలో భార‌తీయులు వ్య‌క్తులుగా, కుటుంబాలుగా, ఒక దేశంగా ఎంతో నేర్చుకున్నార‌ని నమ్రత్ అన్నారు.

ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన‌వారు ఒంట‌రి త‌నం అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ వైర‌స్ బారిన ప‌డిన చిన్న‌పిల్ల‌లు త‌ల్లులకు దూరం అయ్యార‌ని, వ‌యోధికులు ఒంట‌రిగా  ఆస్ప‌త్రుల‌లో ఉండి ఈ వైరస్‌పై  పోరాడాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన మన సిబ్బందికి, మన సహోద్యోగులకు  కూడా తుది వీడ్కోలు ప‌ల‌క ‌లేని ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింద‌ని నమ్రత్ గుర్తుచేశారు. ఇలాంటి  జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ వెన్నంటుతున్నాయ‌ని నమ్రత్, బాధాత‌ప్త హృద‌యంతో అన్నారు.

 కోవిడ్ మ‌హ‌మ్మారి తీవ్రంగా ఉన్న ఆ  చీక‌టి రోజుల‌లో కూడా మన నగర పాలక సిబంది ఆశ‌ను, ధైర్యాన్ని ఇచ్చి ఇత‌రుల‌కు ఊర‌టనిచ్చార‌ని పలువురు అధికారులు గుర్తుచేశారు. వైద్యులు, న‌ర్సులు, పారామెడిక‌ల్‌సిబ్బంది, అంబులెన్సు డ్రైవ‌ర్లు , పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశా వ‌ర్క‌ర్లు, ఇత‌ర ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు త‌మ ప్రాణాల‌కు తెగించి ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడేందుకు కృషి చేశార‌ని నమ్రత్  అన్నారు. వారు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలనుప‌క్క‌న పెట్టి త‌మ విధుల‌ను మానవాళి కోసం నిర్వ‌ర్తించార‌ని నమ్రత్  కొనియాడారు . సిబ్బంది కఠిన శ్రమను గుర్తించి మాన్య కమిషనర్ గారు , ఇంత బిజీ  షెడ్యూల్ లో కూడా  సిబంది పదోన్నతులు ఇవ్వడం , చాలా హర్షణీయం , వారి కి (  కమిషనేర్ గారికి ) సిబ్బంది ఎల్లపుడూ  కృతజ్ఞతతో ఉంటారని , నమ్రత్  తెలిపారు . 

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన - కమిషనర్ శ్రీ . సి.అనురాధ,  A C శ్రీ .నిరంజన రెడ్డి, DC - 1,2,3, డి . శ్రీనివాసరావు , శ్రీనివాసరావు , వెంకట కృష్ణయ్య . మేనేజర్- వెంకట రామయ్య ,  ఆర్.ఓ లు, ప్రసాద్, వేణు, రవి కుమార్, ఎస్.సి.రవి కృష్ణరాజు, అసోసియేషన్ నాయకులు, ఎస్.కె. ఖాజా వాలి, జి.స్రినివాసారావు, నవీన్, అడాపా నాగరాజు, లక్ష్మణ్, ఆర్.శివ రావు మరియు  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పి .నమ్రత్ -సూపరింటెండెంట్ ఎడ్యుకేషన్ సెక్షన్ జీఎంసీ . (AP మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. , డిస్ట్రిక్ట్ మునిసిపల్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ , AP .SC .వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ , డిస్ట్రిక్ట్ JAC కన్వీనర్ .)  తదితరులు పాల్గొన్నారు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow