అగ్నిమీళే పురోహితం - ప్రొఫెసర్ చండ్రపాటి

ఈ మంత్రద్రష్ట పేరు : మధుఛందా వైశ్వామిత్రుడు అట. దేవుడు : అగ్ని ఛందస్సు : గాయత్రీ. ఇది ఋగ్వేదం లోని మొట్టమొదటి మంత్రము.

May 4, 2022 - 07:07
 0
అగ్నిమీళే పురోహితం - ప్రొఫెసర్ చండ్రపాటి
Professor Chandrapati with pancha Veda samhitha, Veda bhagavan,

అగ్నిమీళే పురోహితం 

యజ్ఞస్య దేవమృత్విజమ్౹

హోతారం రత్నధాతమమ్౹౹

 

ఈ మంత్రద్రష్ట పేరు : మధుఛందావైశ్వామిత్రుడు అట.

దేవుడు : అగ్ని

ఛందస్సు : గాయత్రీ.

ఇది ఋగ్వేదం లోని మొట్టమొదటి మంత్రము.

(ఈ మంత్రానికి ముందు ఓం అని, మంగళశ్లోకం అని ఏమీ లేవు. అనివిజ్ఞులు గ్రహించగలరు)

అగ్నిం ఈళే = అగ్నిని స్తుతించుచున్నాను.

ఎటువంటి అగ్నికి .....

పురోహితం = అందరికన్నా ముందుండి జనులకు హితము (మంచిని) కలిగించువాడు.

యజ్ఞస్య దేవం ఋత్విజం = యథావసరము ప్రజానుకూల యజ్ఞము జేయువాడు, యజ్ఞమునకు ఋత్విక్కు, యజ్ఞ ప్రకాశకుడు, దేవత.

హోతారం = హోత, పిలుచువాడు.

రత్నధాతమమ్ = రత్నములను ధరించువాడు.

అగ్నియనగా శిల్పి, స్థపతి.

ఈ శిల్పి యజ్ఞము నకు ముందుండి యజ్ఞాయుధములను, యజ్ఞ కుండమును కొలతలకు అనుగుణముగా నిర్మించును.

ఊరి జనులకు ముందుండి నాగలి కొడవలి కర్రు కారు బండి చక్రములను నిర్మించి సమాజమునకు సహకరించును.

ఇతర అవసరముల యందు పురోహితుడగును.

హోతయై, ఈ యజ్ఞములయందు అందరినీ ఆహ్వానించును.

రత్నధాతమమ్= రత్నములను ధరించును, ధరింపజేయును. రత్నములను ఇతరులకు దానము చేయును.

తప్పులున్న పండితులు సవరించి నన్ను కృతార్థుని చేయగలరు.

 

నమో విశ్వకర్మణే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow