ఉద్యోగులు సమ్మెకు సిద్ధం.. తప్పదా యుద్ధం..? నేడే సీఎస్ కు నోటీస్

Jan 24, 2022 - 12:06
Jan 24, 2022 - 12:07
 0
ఉద్యోగులు సమ్మెకు సిద్ధం.. తప్పదా యుద్ధం..? నేడే సీఎస్ కు నోటీస్
AP PRC , GOVT EMPLOYEES

AP GOVT Employees:2022|01|24| కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు. మరోవైపు పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని నుంచి పిలుపు వచ్చింది.

చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించగా.. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలకు వెళ్లాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది.

ఓ వైపు ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతుంటే, మరోవైపు పీఆర్సీ అమలు చేసేందుకే ఏపీ సర్కార్ మొగ్గుచూపుతోంది.

కొత్త పే స్కేల్‌తో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ.. ట్రెజరీ, CFMS, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించిన పురోగతిపై ప్రతీరోజూ 11 గంటలలోగా డైరెక్టర్‌కు వివరించాలని ఆదేశించింది. ఈనెల 25లోగా కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow