విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి - బిజెపి మాజీ దళపతి కన్నా

పేద ప్రజల పై భారాన్ని, సహించం.

Sep 18, 2021 - 17:12
 0
విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి - బిజెపి మాజీ దళపతి కన్నా

విద్యుత్ ఛార్జీలను పెంచడం పేదలపై భారమే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి నవ్యాంధ్ర బిజెపి మాజీ కమళ దళపతి కన్నా లక్ష్మీ నారాయణ :

భారత ప్రధాని నరేంద్రమోడీ గారి జన్మదిన వేడుకల సంధర్భంగా బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ అభియాన్ కార్యక్రమం సంధర్భంగా శనివారం కన్నావారి తోటలోని చౌకడిపో లో రేషన్ బ్యాగుల పంపిణీ మరియు షాపు వద్ద భారత ప్రధాని నరేంద్రమోడీ గారి ఫ్లెక్సీని మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీమంత్రి రావెల కిషోర్ బాబు గారితో కలిసి ఏర్పాటు చేశారు.

ఈ సంధర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో ప్రజలపై భారం పడుతుందని కరోనా సంక్షోభంతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదని తక్షణమే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.

మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయికే ఇస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా 37రూపాయల సబ్సిడీ ఇస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేషన్ పంపిణీ వాహనాల మీద వారి ఫొటోలతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేసుకోవడం సబబు కాదని రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి అన్ని చౌకడిపోల వద్ద మోడీ గారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు.

కార్యక్రమంలో జాతీయ లేబర్ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ,మాజీమంత్రి శనక్కాయల అరుణ,జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,సమర్పణ అభియాన్ జిల్లా కన్వీనర్ నీలం ప్రసాద్,కో కన్వీనర్ మల్లాల లక్ష్మీ నారాయణ,ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివన్నారాయణ,జిల్లా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు,మహిళా మోర్చా అధ్యక్షురాలు నమ్రతా,సెన్సార్ బోర్డు సభ్యురాలు పొగతోట రమాకుమారి,డిఆర్యుసిసి సభ్యులు పాలిశెట్టి రఘ, nyks డైరెక్టర్ వనమా నరేంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్,బిజెపి నాయకులు కొర్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow