ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డును రద్దు చేయడం తగదు. వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్

ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డును రద్దు చేయడం తగదు. వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్

ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డును రద్దు చేయడం తగదు. వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్.

కాకినాడ : మినిమం గవర్నమెంట్ మాగ్జిమం గవర్నెన్స్ లో భాగంగా  కేంద్రం  ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డును రద్దు చేసి తప్పు చేసిందని ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అదికార ప్రతినిది కెకె సంజీవరావు అన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా చేనేత కార్మికులు  ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి సిద్దంగా ఉన్న తరుణంలో కేంద్రం తమ సంతోషాలపై నీళ్ళు జల్లడం తగదన్నారు. దేశ వ్తాప్తంగా జరిగిన చేనేత కార్మికుల ఉద్యమ ఫలితంగా  న్యూ హ్యాండ్లూం & టెక్సటైల్ పాలసీలో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం  దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న చేనేత కార్మికులకు ఉత్పత్తి, వినియోగం, విస్తరణ, మార్కెటింగ్ విషయంలో  దిశ దశ చూపడానికి 1992లో ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డు ఏర్పాటు చేసిందన్నారు.

గత 28 సంవత్సరాల నుంచి నేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగం అభివృద్ధికి బోర్డు  ప్రభుత్వానికి సలహా సూచనలిస్తు దేశయ చేనేత ఉత్పత్తులకు విదేశీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలోను, అలాగే  చేనేత బడ్జట్ కేటాయింపులలో క్రీయాశీలకంగా వ్యవహరించిందని సంజీవరావు అన్నారు. చేనేత దేశ వారసత్వ సాంస్కృతి  సంపదని ఈ రంగాన్ని పరిరక్షించుకోవడం దేశ పౌరులుగా మనందరి భాద్యతని అన్నారు.

స్వతంత్ర సమరస్పూర్తికి చిహ్నమైన చేనేత రంగం స్వదేశీ ఉత్పత్తి అయినందున కేంద్ర ప్రభుత్వం తక్షణం తమ నిర్ణయాన్ని వాపసు తీసుకివాలని లేదా బోర్డు స్థానే సమీకృత చేనేత డవ్లప్మెంట్ & వీవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి అంపశయ్య మీద ఉన్న చేనేత రంగానికి పునర్జీవం కల్పించి.

వ్యవసాయం తర్వత జీవన ఉపాది పొందుతున్న కోట్లాది మంది చేనేత కార్మికులకు న్యాయం చేయాలని  సంజీవరావు డిమాండ్ చేసారు. త్వరలో జరగబోవు ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ అంశాన్ని అజండా అంశంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు.

కెకె సంజీవరావు, 
అదికార ప్రతినిది
ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, 9246657227
తేది : 06.08.2020