పన్నులపేరుతో  ప్రజా దోపిడీని ఆపేవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. - జక్కా శ్రీనివాస్. 

పన్నులపేరుతో  ప్రజా దోపిడీని ఆపేవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. - జక్కా శ్రీనివాస్. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపేరుతో  ప్రజా దోపిడీని ఆపేవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. - జక్కా శ్రీనివాస్. 

అమరావతి/పొన్నూరు.: "ప్రజాకంఠక బిజెపి ప్రభుత్వం పన్నుల పేరుతో రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్న పెట్రో డీజల్ LPG మరియు నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరు సాగిస్తూనే ఉంటుందని,

గత ఏడు సంవత్సరాలుగా బిజెపి దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తూ, ప్రజలను పీడిస్తోందని, రానున్న రోజుల్లో బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని" పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జక్కా శ్రీనివాస్ అన్నారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూచనలతో ది నుండి వరకు రోజుకో కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు మండలం మంచాల మరియు నారాకోడూరు లో చేపట్టిన సంతకాల సేకరణ మరియు నిరసన కార్యక్రమాల్లో భాగంగా జక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ -

"ఒక వైపు కోవిడ్ మరోవైపు ధరలపెరుగుదల రెండూ కేంద్ర రాష్ట్రాల వైఫల్యాలని, రెండు ప్రభుత్వాలు నిరుద్యోగులు, ధరల నియంత్రణపై సమీక్ష జరిపి ప్రజల ఆర్ధిక బాధల్ని తగ్గించాలని" డిమాండ్ చేసారు.

ఈకార్యక్రమంలో చేబ్రోలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండలనేని కోటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోట నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.