నకిలీ సంస్థల ద్వారా రూ.376 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందిన వ్యక్తిని అరెస్టు- గురుగ్రాం డిజిజిఐ
ఆర్థిక మంత్రిత్వ శాఖ
సిగిరెట్లు ఎగుమతి చేసినట్టు చూపుతూ నకిలీ, డమ్మీ, పని చేయని సంస్థల ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా ఐజిఎస్‌టి రీఫండ్ పద్ధతి ద్వారా అక్రమంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ని పొందారన్న ఆరోపణలతో హర్యానా, బహదూర్‌గఢ్‌కు చెందిన రితేష్ అగర్వాల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డిజిజిఐ), గురుగ్రాం జోనల్ యూనిట్ అరెస్టు చేసింది.
ఎం/ఎ స్ ఎస్ఆర్ ఇంపెక్స్ ప్రొపరైటర్ అయిన రితేష్ అగర్వాల్ ఎం/ ఎస్ ఎస్ ఆర్ ఇంటర్నేషనల్ అనే మరొక సంస్థకు వాస్తవ యజమాని అనే విషయం దర్యాప్తులో బయిటపడింది. ఈ సంస్థ సరఫరా లంకెలో ఆరు డమ్మీ సంస్థలు - ఎం/ఎ స్ జోల్స్ ట్రేడింగ్ కో, ఎఎస్ ట్రేడర్స్, ఎఆర్ ట్రేడర్స్, ఓం ట్రేడర్స్, కాపిటల్ ఇండియా & ఎస్ ఎం ఇంటర్ ప్రైజెస్ రితేష్ అగర్వాల్ నియంత్రణలో ఉన్నాయని వెల్లడైంది. ఈ సంస్థలన్నింటిలోనూ రితేష్ అగర్వాల్ సరుకులేకుండా బిల్లింగ్ ద్వారా రూ. 376 కోట్ల ఐటిసిని పొందారు. శాఖ రితేష్ అగర్వాల్ కు రూ.37.13 కోట్లను రిఫండ్‌ను మంజూరు చేసింది.
ఇందుకు అదనంగా, రితేష్ అగర్వాల్ పాత నేరగాడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు కేసులో నకిలీ సంస్థ ఎం/ ఎస్ ఎస్ ఎస్ &కో (GSTIN 06DJUPD5067G2ZW) ద్వారా ఇదే పద్ధతిలో నకిలీ ఐటిసీని పొందిన రూ. 26.53 కోట్ల వ్యవహారంలో షోకాజ్ నోటీసును జారీ చేశారు.
అంతేకాకుండా, రవిగుప్తా అనే మారుపేరు కలిగిన రితేష్ అగర్వాల్, వక్కల దిగుమతిలో స్థానిక ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసి మోసపూరితంగా డ్రాబ్యాక్‌ను పొందినందుకు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకు డిజిఆర్ ఐ 01.03.2019న షోకాజ్ నోటీసును జారీ చేసింది.
దర్యాప్తు ఢిల్లీ, హర్యానాలలోని బహుళ ప్రదేశాలలో నిర్వహించడమేకాక, ఈ సంస్థలకు సరఫరా చేసే అనేకమంది సప్లయర్ల స్టేట్మెంట్లు, పత్రాలతో కూడిన సాక్ష్యాల ఆధారంగా, రితేష్ అగర్వాల్ నకిలీ/ ఉనికిలో లేని/ డమ్మీ సంస్థల రాకెటింగ్‌ను నిర్వహించడంలో, మోసపూరితంగా రూ. 376 కోట్ల ఐటిసిని పొందడంలో రితేష్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని ఖరారు చేశారు. ఈ క్రమంలో రితేష్ అగర్వాల్‌ను 09.02.2021న అరెస్టు చేసి, ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ డ్యూటీ ఎంఎం ఎదుట హాజరుపరచగా ఆయన జ్యుడిషయల్ కస్టడీని విధించారు.
ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
What's Your Reaction?






