YSRCP అసమర్థ ప్రభుత్వం వెంటనే గద్దె దిగి తిరిగి ప్రజాభిప్రాయానికి అవకాశం కల్పించాలి- భావన్నారాయణ

అత్యాచారాలను, హత్యలను నిలువరించలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే గద్దె దిగి తిరిగి ప్రజాభిప్రాయానికి అవకాశం కల్పించాలని గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ డిమాండు చేశారు.

May 14, 2022 - 18:18
 0

 రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు గల డా: బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనదీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం భావన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేసింది లేకపోగా అప్పులవూబి లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రక్షణ కల్పించవలసిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి, మహిళా కమిషన్ చైర్మన్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే బాధ్యతారహితంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీరికి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు కనుక తక్షణమే రాజీనామా చేసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించాలని కోరారు.

కార్యక్రమాన్ని సందర్శించి మద్దతు తెలిపేందుకు విచ్చేసిన పట్టణ బీజేపీ అధ్యక్షులు దివ్వెల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, హాస్పిటల్స్, ఆఫీస్ లతో సహా చివరికి సొంత ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్ధరాత్రి మహిళలు స్వేచ్చగా తిరిగినప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఒకప్పుడు పెద్దలు చెప్పేవారని, కానీ నేడు పట్టపగలు కూడా మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల పార్టీ అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, పార్టీ కార్యాలయ ఇంఛార్జి సిరిగిరి మణికంఠ, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, దమ్మాలపాడు ఎంపీటీసీ శిరిగిరి రామారావు, వీరమహిళలు మాలెంపాటి సౌజన్య, తిరుమలశెట్టి మల్లీశ్వరి, జనసైనికులు కేదారి రమేష్, అడపాల ధర్మరాజు, తదితరులు ప్రసంగించగా వీరమహిళలు నామా పుష్పలత, సూలం రాజ్యలక్ష్మి, జనసైనికులు రాట్నాల సోమశేఖర్, బిట్రగుంట కృష్ణారావు, తోట హరి, బశవుల వెంకటకృష్ణ, అంచుల ఆంజనేయులు, తోట శ్రీను, మిద్దెం లక్ష్మీనారాయణ, చేపూరి వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి సాంబ, అంబటి రామసాయి, ఏసుబాబు, చిట్యాలు, బత్తిన శ్రీను, సుబ్బు, రామాంజనేయులు, తిరుమల సాంబ, తాడువాయి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow