విదేశాలకు వెళ్ళేటప్పుడు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరణకు వీలు కల్పించేలా నిబంధనలను నోటిఫై చేసిన ఎంఆర్‌టీహెచ్

భారతీయ పౌరులకు విదేశాలలో ఉన్న వేళ ఐడీపీ గడువు ముగిసినపుడు వారి అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ) జారీ చేయడానికి వీలుగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జనవరి 7న ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మన దేశపు పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు వారి ఐడీపీ గడువు ముగిస్తే దానిని పునరుద్ధరణకు ఇప్పటి వరకు ఎటువంటి విధానం లేదు. దీంతో తాజా విధానం తీసుకువచ్చారు. ఈ నోటిఫికేషన్‌తో భారత పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు భారత రాయబార కార్యాలయాలు / మిషన్ల ద్వారా ఐడీపీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులు భారతదేశంలోని వాహన్ పోర్టల్‌కు తరలిపోతాయి, వీటిని సంబంధిత ఆర్టీఓలు పరిశీలిస్తారు. ఐడీసీ సంబంధిత పౌరుడికి అతని / ఆమె చిరునామాలో ఆర్‌టీవోచే కొరియర్ చేయబడుతుంది. ఐడీపీ రెన్యూవల్ కోసం అభ్యర్థన చేసే సమయంలో భారతదేశంలో అమలులో ఉన్న మెడికల్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే వీసా యొక్క షరతులను కూడా ఈ నోటిఫికేషన్ తొలగిస్తుంది. చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పౌరుడికి మరొక వైద్య ధ్రువీకరణ పత్రం అవసరం లేదనే ఆలోచనతో ఈ నిబంధనను తీసుకొచ్చారు. దీనికి తోడు ఆ దేశానికి చేరిన తరువాత వీసా జారీ చేయబడుతన్న దేశాలు.. లేదా చివరి క్షణంలో వీసాలను జారీ చేస్తున్న దేశాలున్నందున అటువంటి సందర్భాలలో, ప్రయాణానికి ముందు భారతదేశంలో ఐడీపీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వీసా అందుబాటులో ఉండదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీసాతో సంబంధం లేకుండానే ఐడీపీకి దరఖాస్తు చేయవచ్చు.
What's Your Reaction?






