ప్రధానమంత్రి గతిశక్తి - యంట్రప్రగడ కె శ్రీనివాస్

వచ్చే25 సంవత్సరాలకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని కదం తొక్కుతూ కదలడానికి సిద్ధం అంటుంది నా దేశం..

ప్రధానమంత్రి గతిశక్తి - యంట్రప్రగడ కె శ్రీనివాస్

Article By:- యంట్రప్రగడ కె శ్రీనివాస్ (YKAY) 9492188881

అపారమైన సహజ వనరుల తో పాటుగా మానవ వనరులు కూడా మన దేశానికి స్వంతం.. సరైన దిశా నిర్దేశం ఉంటే విశ్వ గురుత్వం వహించడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఏకైక దేశం కూడా మనదే..

అతి పెద్ద బీద దేశం గా ఉండి కూడా హరిత విప్లవం (green revolution), పాల విప్లవం (white revolution) లాంటి అనేక విజయాలు సాధించి ఉత్సాహంతో కదం తొక్కుతుంది ఇప్పటికే.. అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒకటైంది ఈ మధ్యనే..

మన వాళ్ళ మీద మనకు నమ్మకం లేకపోవచ్చు కానీ, 8.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందంటూ IMF అంచనాలు కూడా వేసేసింది.. చైనా కోవిడ్19 లాక్డౌన్ వలన ఏర్పడిన ఆర్ధిక ప్రతిష్టంభన లో కూడా 2శాతం కి పైగానే వృద్ధి రేటు నమోదు చేసింది.. అగ్రరాజ్యాలు సైతం మైనస్ వృద్ధి రేటు నమోదు చేయడం మన దేశపు శక్తి ని అంచనా వేయవచ్చు. ఇకపై కూడా అనేక విజయాలు సాధించి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని ఆశిస్తూ..

"మన వాళ్ళు ఒట్టి వెథవాయిలోయ్" అన్న గిరీశం మాటలను ఒక్కోసారి నిజం కూడా చేసేస్తాం మనమే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్ర నాయుడు గారు *"విజన్2020"* అనే రూట్ మ్యాప్ తయారు చేస్తే, ఉచితాలకు కక్కుర్తి పడి ఓడించేశారు మనవాళ్ళు.. గౌరవ ప్రధాని శ్రీ మోడీ గారి సారథ్యంలో

*"ప్రధాన మంత్రి గతిశక్తి"* పేరుతో తయారు చేసిన రూట్ మ్యాప్ ఖచ్చితంగా అమలు చేసేలా మద్దతివ్వాల్సింది మనమే.. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశీయు లు కాదు..

"21వ శతాబ్దం ఖచ్చితంగా నా భారత దేశానిదే" అన్న స్వామీ వివేకానందుల వారి మాటలను గుర్తు తెచ్చుకుంటూ. దుర్గాష్టమి శుభాకాంక్షలతో భారత మాతకు జయము కలుగుగాక!

యంట్రప్రగడ కె శ్రీనివాస్ (YKAY) 949218888.

Donate to MDN NEWS 

mydigitalnews.in/donate