స‌ర్దార్ ప‌టేల్ జాతీయ ఏక‌తా అవార్డు -2021 నామినేష‌న్ల గ‌డువు తేదీ ఆగ‌స్టు 15, 2021

Jul 4, 2021 - 12:39
 0
స‌ర్దార్ ప‌టేల్ జాతీయ ఏక‌తా అవార్డు -2021 నామినేష‌న్ల గ‌డువు తేదీ ఆగ‌స్టు 15, 2021

స‌ర్దార్ ప‌టేల్ జాతీయ ఏక‌తా వార్డు -2021 అవార్డు కోసం అర్హులైన‌వారు త‌మ నామినేష‌న్ల‌ను పంప‌డానికి లేదా అర్హులైన‌వారి త‌ర‌ఫున ఇత‌రులు సిఫార‌సులు పంప‌డానికిగాను ఆగ‌స్టు 15, 2021 చివ‌రి తేదీ. కేంద్ర హోంశాఖ‌కు చెందిన https://nationalunityawards.mha.gov.in వెబ్ సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను పంప‌వ‌చ్చు. 

దేశ ఐక‌మ‌త్యం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేసేవారికి ఇచ్చే ఈ పౌర అవార్డును శ్రీ స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ పేరుమీద కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. జాతీయ ఐక‌మ‌త్యాన్ని కాపాడుతూ దృఢ‌మైన బ‌ల‌మైన భార‌త‌దేశ సాధ‌న‌కోసం కృషి చేసేవారి స్ఫూర్తిదాయ‌క సేవ‌ల‌ను గుర్తించ‌డానికి ఈ అవార్డును నెల‌కొల్పారు. కుల మ‌త ప్రాంత రాజ‌కీయాలు వ‌య‌స్సు వృత్తికి అతీతంగా ఎవ‌రైనా స‌రే ఈ అవార్డుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ్య‌క్తులే కాదు సంస్థ‌లు కూడా ఈ అవార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

భార‌త దేశంలోని ఏ వ్య‌క్త‌యినా, ఏ సంస్థ‌యినా స‌రే అర్హత వున్న‌వారిని, అర్హత వున్న సంస్థ‌ల పేర్ల‌ను ఈ అవార్డు కోసం పంప‌వ‌చ్చు. అలాగే ఎవ‌రికి వారు త‌మ స్వంతంగా కూడా ద‌ర‌ఖాస్తులు పంప‌వ‌చ్చు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ‌శాఖ‌లు కూడా అవార్డుకోసం ద‌ర‌ఖాస్తులు పంప‌వ‌చ్చు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow