వైఎస్ఆర్ సీపీ టిడ్కో ఇళ్ళ భాగోతాన్ని ప్రపంచానికి చూపిస్తాం - గాదె,జనసేన,గుంటూరు

ఈనెల 12 13 14 తారీకులలో మా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిక్టో గృహాలు, జగనన్న గృహాలపై జరుగుతున్న మోసాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయడం మా పార్టీ ముఖ్య ఉద్దేశం: గాదె

వైఎస్ఆర్ సీపీ టిడ్కో ఇళ్ళ భాగోతాన్ని ప్రపంచానికి చూపిస్తాం - గాదె,జనసేన,గుంటూరు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భానుబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ: మేము రేపు చేయబోవు కార్యక్రమం "జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు' కార్యక్రమం అధికార పార్టీ వారు టిక్టో గృహాలు ,జగనన్న గృహాలపై వారు చేస్తున్న అన్యాయాలపై ప్రజలకు తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.. గాదె గారు మాట్లాడుతూ: ఈనెల 12 13 14 తారీకులలో మా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిక్టో గృహాలు, జగనన్న గృహాలపై జరుగుతున్న మోసాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని మా పార్టీ ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు మాకు సహకరించి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మీడియా సోదరులు కూడా నిలబడతారు అని కోరుకుంటున్నాను. నిన్న ధర్మాన ప్రసాద్ గారు చెప్పారు ఇప్పటివరకు మూడు, మూడు రాజధానులు అని మూలుగుతున్న ఈ అధికార పార్టీ నాయకులు ఇక నుంచి మూడు ఉండదు ఒక్క రాజధాని మాత్రమే ఉంటుందని చెప్పారు. కానీ ఈ విషయంపై ఒక్క అధికార పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడే దమ్ము కూడా లేదు.

జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాము రాజధానులు మూడు కాదు ఒకటి అని అన్నారు కదా మరి ఏమైపోయారు రాయలసీమ నాయకులు గానీ కోస్తా ఆంధ్ర నాయకులు గానీ మీరు ఎక్కడ ముడుసుకొని కూర్చున్నారు అని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం మీ పార్టీ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చేయాలని అని వికేంద్రీకరణ చేయాలి అన్నారు కదా ఇప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారో చెప్పాలి. జనసేన పార్టీ రాజకీయాల్లో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు.

ఇప్పటివరకు జరుగుతున్న మూస రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న రాత్రి సాక్షి ఛానల్ లో జర్నలిస్ట్ ముసుగులో ఈశ్వర్ అనే జర్నలిస్ట్ పిలవబడే ysr పార్టీ కార్యకర్త డిబేట్ నిర్వహించడం గమనించాము. ఈశ్వర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారిపై కొందరు దుండగులు రెక్కి నిర్వహించినది శుద్ధ అబద్ధమని చెప్పారు.

మేము అతన్ని సూటిగా అడుగుతున్నాం మీ పార్టీకి సంబంధించిన రెడ్డి వెల్ఫేర్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి కారులో ఆ దుండగులు వచ్చి ఉన్నది నిజం కాదా మీరు మీ పార్టీకి సంబంధించి లక్ష గొప్పలు చెప్పుకో లేదా టిడిపి గురించి ఒక లక్ష అబద్ధాలు చెప్పుకో కానీ మా పార్టీపై ఒక్క అబద్ధం చెప్పినా ఊరుకునేది లేదు మీ పార్టీకి గాని మీ సాక్షి ఛానల్ వాళ్లకు గాని దమ్ముంటే మా పార్టీ నాయకులను మీ ఛానల్ లో డిబేట్ పిలవండి చూసుకుందాం..

ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చి వేయలేదు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీ సాక్షి ఛానల్ లో దమ్ముంటే మీ ysr పార్టీ నాయకులు గానీ సాక్షి ఛానల్ యాజమాన్యం కానీ ఇప్పటం నడిబొడ్డులో కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేము సవాల్ విసురుతున్నాము మీకు అక్కడ ఒక్క ఇల్లు కూల్చలేదు అని మీరు చెప్తున్నారు. 50 ఇల్లు పైన కూల్చారని మేము నిరూపిస్తాం.దమ్ముంటే మా సవాన్ని స్వీకరించాలి ..

పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో భాగంగా విచ్చేసినప్పుడు అక్కడ జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించారు కానీ మీ పార్టీ జగన్ రెడ్డి గారి నాన్నగారి విగ్రహాలు తొలగించలేదు అని ప్రశ్నిస్తే అది కూడా శుద్ధ అబద్ధం అని మీ ఛానల్ లో చెప్తారా.. సాక్షి జర్నలిస్ట్ ఈశ్వర్ గారికి ఒకటే సవాల్ మీ సాక్షి యాజమాన్యం మొత్తం దమ్ముంటే ఇప్పటం గ్రామం రావాల్సిందిగా కోరుచున్నాము.

అక్కడ జనాలే మీకు బుద్ధి చెబుతారు నీకు చానల్ ఉంది కదా అని నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పమాకు జర్నలిస్టు ముసుగులో ఒక పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నావ్ భవిష్యత్తులో నీకు కూడా సరైన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు..

రాష్ట్ర కార్యదర్శి కమల్: ఈనెల 12 13 14 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు మేరకు టిక్టో గృహాలకు, జగనన్న గృహాలకు సంబంధించి అధికారం పార్టీ వారు చేస్తున్న మోసాలను తెలియజేయటానికి ఈ కార్యక్రమం చేయదలిచాము. వాటిని మేము సందర్శించి పూర్తి అవగాహనతో అధికార పార్టీ వారు ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారు ప్రజలకు వివరిస్తాం.

జగన్ రెడ్డి గారు 28 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు కానీ ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇచ్చిన దాఖలా లేదు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు,బిట్రగుంట మల్లిక,నారదాసు రామచంద్ర ప్రసాద్,కూరపాటి నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు గార్లు పాల్గొన్నారు..