హెర్నియా రావటానికి గల కారణాలు మరియు చికిత్స పద్ధతులు

వ్యాధి నిర్ధారణ పరీక్షలు : ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.. ఏ మందులూ పని చేయవు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. ఇది రెండు రకాలు: 1. బలహీనపడిన కండరాలను తిరిగి గట్టి proline దారంతో కుట్టడం. 2. Proline Mesh (proline దారంతో అల్లబడిన తెర) ను వేసి కుట్టడం.

Jul 8, 2021 - 09:48
 0
హెర్నియా రావటానికి గల కారణాలు  మరియు చికిత్స పద్ధతులు

ఒక మజిల్ లేదా టిష్యూకి ఏర్పడిన అసాధారణ  ఓపెనింగ్ లో నుండి టిష్యూ కానీ, ఒక ఆర్గన్ కానీ బయటకి రావడాన్ని హెర్నియా అంటారు. ఇంకా చెప్పాలంటే గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి.

అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. హెర్నియా స్త్రీ పురుష భేదం లేకుండా అన్ని వయసుల వారికీ రావచ్చు. పిల్లల్లో కంజెనిటల్ హెర్నియాలు చాలా కామన్. పురుషుల్లో ఇంగ్వైనల్ హెర్నియా కామన్ అయితే స్త్రీలలో అంబ్లిక, ఫెమోరల్ హెర్నియాలు కామన్ గా వస్తాయి.

అదే సమయం లో హెర్నియా రావడానికి కల కారణం తెలుసుకోవడం కూడా ముఖ్యమే

హెర్నియా రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.

1. అబ్డామినల్ మజిల్స్ బలహీనంగా అయిపోవడం

2. అబ్డామిన్ లో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ కంటెంట్స్ ని బలహీనపడ్డ ప్రదేశం లో నుండి బయటకి తోయడం.

వాల్ వీక్నెస్ కి కొన్ని కారణాలు

1. పుట్టుకతోనే అలా ఉండి ఉండవచ్చు 2. ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇలా జరగవచ్చు 3. ఎక్కువసార్లు గర్భ ధారణం 4. సర్జరీ చేసినప్పుడు పెట్టే కోత ఎంత ట్రై చేసినా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదా.. కారణాలు ఇవే.. అబ్డామినల్ ప్రెషర్ కి కారణాలలో కొన్ని: ఎక్కువ కాలం ఉండే దగ్గు, కాన్స్టిపేషన్ , యూరినరీ స్ట్రైనింగ్, హెవీ ఎక్సర్సైజ్.

హెర్నియా పలు రకాలు

1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)

2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)

3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)

4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

వ్యాధి లక్షణాలు

1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)

చికిత్సా విధానం పై అవగాహన 

హెర్నియా ని చాలావరకు  సర్జరీ ద్వారానే ట్రీట్ చేస్తారు, కొందరికి కేవలం మెడిసిన్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం క్యూర్ అవ్వదు. హెర్నియా సర్జరీ లో సాధారణంగా హెర్నియల్ కంటెంట్ ని రెడ్యూస్ చేయడం, డిఫెక్ట్ ని సరి చేయడం, అక్కడ ఒక మెష్ పెట్టడం ద్వారా రీ ఇంఫోర్స్ చేయడం వంటివి ఉంటాయి.

ఈ సర్జరీ లాప్రోస్కోపిక్ లేదా ఓపెన్ సర్జరీ ద్వారా చేయవచ్చు. ఎలా చేయాలి అన్నది హెర్నియా లక్షణాలని బట్టి సర్జన్ యొక్క ప్రిఫరెన్సెస్ ని బట్టీ ఉంటుంది. చాలా రకాల హెర్నియాలకి లాపరోస్కోపిక్ సర్జరీనే ఎక్కువ మంది సర్జన్లు ఎంచుకుంటున్నా, కాంప్లెక్స్, రికరెంట్ హెర్నియాలకీ, సైజ్ లో పెద్దగా ఉన్న హెర్నియాలకీ ఓపెన్ సర్జరీనే ప్రిఫర్ చేస్తున్నారు.

లాపరోస్కోపిక్ సర్జరీ కి తక్కువ నొప్పి, త్వరగా రికవర్ అవ్వడం, హాస్పిటల్ నుండి త్వరగా డిస్చార్జ్ అవ్వడం, తొందరగా మళ్ళీ రొటీన్ లోకి వెళ్ళిపోగలగడం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలం లో కాంప్లెక్స్ హెర్నియా సర్జరీలు కూడా లాపరోస్కోపిక్ టెక్నిక్ ద్వారా సక్సెస్‌ఫుల్ గా చేస్తున్నారు.

హెర్నియా సర్జరీ అనేది ప్రపంచవ్యాప్తం గా చాలా కామన్ గా చేసే సర్జరీల్లో ఒకటి. అబ్డామిన్లో కానీ, గజ్జల్లో కానీ గడ్డలా తగిలితే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. సర్జరీ తరువాత కూడా కొన్ని నెలల పాటూ కేర్‌ఫుల్ గా ఉండాలి, మరీ ఎక్కువగా అలిసిపోయే పనులేమీ చేయకూడదు.

హెర్నియా ని ట్రీట్ చేసినప్పుడూ దాని కారణాన్ని కూడా ట్రీట్ చేయకపోతే ఈ సమస్య మళ్ళీ రావచ్చు. అందుకనే, ఎలాంటి రిగరస్ యాక్టివిటీ అయినా ఎవాయిడ్ చేయాలి, కాన్స్టిపేషన్, దగ్గు వంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే, సర్జరీ తరువాత చాలా మంది పేషెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు.

Note: this article is and the information and information provided in this article are based on general information. and it is not suitable for everyone, and neither MDN NEWS, mydigitalnews.in. nor its team does not confirm these. Please contact the relevant expert, or doctor before implementing them.)

గమనిక: ఈ వ్యాసం మరియు ఈ వ్యాసంలో అందించిన సమాచారం , సాధారణ సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. మరియు ఇది అందరికీ అనుకూలంగా ఉండదు మరియు MDN NEWS, mydigitalnews.in. లేదా దాని బృందం వీటిని నిర్ధారించదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించండి.)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow