అఘోరి అంటే ఎవరు ? అఘోరి సంప్రదాయం గురించి ఒక చిన్న పరిచయం

who is Aghori, Aghori mydigitalnews, aghor history, Anand nath ji Aghori, Parama pujya sri sri sri Rajesh nath ji Aghori,

Oct 9, 2022 - 09:01
Feb 26, 2024 - 08:56
 0
అఘోరి అంటే ఎవరు ? అఘోరి సంప్రదాయం గురించి ఒక చిన్న పరిచయం

అఘోరీ సాంప్రదాయం సనాతనం మరియు అత్యంత కఠినం. ప్రస్తుత సమాజంలో ఈ సాంప్రదాయం పట్ల అవగాహన కన్నా అపోహలు, అపార్భాలే ఎక్కువ. ముఖ్యంగా అఘోరీలు మృతదేహాన్ని తింటారని, క్షుద్రపూజలు చేస్తారని, నిధులు తీస్తారని ఇలాంటి అపోహలు చాలా ఎక్కువ, కానీ నిజానికి ఇవన్నీ అవాస్తవాలే. వాస్తవంలో అఘోరీల్లో ౩ పంత్‌లు ఉంటాయి.

1.దక్షిణపంత్‌ _ 2.వామపంత్‌  _ 3. కీనారామ్‌ పంత్‌

దక్షిణపంత్‌ అఘోరీలు నాథ్‌ సాంప్రదాయానికి చెందినవారు. శివుని పంచముఖములలో దక్షిణముఖమైన అఘోరీ తత్వాన్ని స్వీకరించిన శ్రీగురు దత్తాత్రేయులు తన శిష్యుడైన శ్రీ గురు జాలంధర్ నాథ్ నకు ఈ సాంప్రదాయాన్ని అనుగ్రహించారు . గురు జాలంధర్ నాథ్ శిష్యుడైన , శ్రీ గురు ఖానీఫా నాథ్ అఘోర సాంప్రదాయాన్ని , విస్తరింపజేశారు . ఇలా సనాతనం గా వస్తున్న ఒక విశిష్ట సంప్రదాయమే , ఈ అఘోర సాంప్రదాయం , అఘోర పరంపర . 

అఘోరీ అంటే “అ-ఘోరము అనగా ఘోరము కానిది" అని అర్ధము. మనం అందరం శివుడు స్మశానంలో ఉంటాడు అని అంటూ ఉంటాం. అంతటి మహదేవునితో మమేకం కావటానికి  అఘోరీల సాధనాస్థలి స్మశానమే. శివుని నివాసంలో క్షుద్రం, చెడు జరుగుతుందా ? క్షుద్రం  అనేది మనిషి మెదడులో ఇతరులకు హాని చెయ్యాలనే సంకల్ప రూపమే తప్ప మంత్ర, తంత్ర, శాస్త్రాలు ఎప్పడూ క్షుద్రం కావు. అఘోరీలు ఎవరూ క్షుద్రులు కారు. సాధారణంగా వీరు నలుపు వస్త్రాలు ధరిస్తారు. కాషాయ ధ్ధారణకి అర్థం త్యాగం అయితే, అఘోలీలు ధరించే నలుపుకి అర్థం సమత్వం సుఖ:దుఖ్ధాలని ఒకే దృష్టితో చూసే తత్వం.

పూర్తి వైజ్ఞానిక దృష్టితో, వాస్తవంలో జీవించడమే అఘోరీల లక్షణం. అఘోరీలు వంటిపై ధరించే చితాభస్మం కూడా అర్థవంతమే. స్మశానాలలో నివశించే వీరికి వాతావరణం నుండి రక్షణ, చర్మ రోగాలు రాకుండా నిరోధించందడం ఇలా అనేక ప్రయోజనాలు. భౌతికంగా ఉంటే మానసికంగా అఘోర సాధకుని అహంకారం అంతరించి తన వాస్తవ స్థితిని తనకు తెలియ చేసీ శివ ప్రసాదమే చితాభస్మం, ఈ భస్మధారణను చూసి నాగ సాధువులుగా అనుకుంటారు . నాగ సాధవులంటే శ్రీ ఆదిశంకరుల వారు. ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సైన్యం. వారు హోమ భస్మాన్ని ధరిస్తారు, నగ్నంగా ఉంటారు. అఘోరీలు ఎప్పడూ నగ్నంగా ఉండరు. సాధన సమయంలో లంగోటీ మాత్రమే ధరిస్తారు.

ఇక శవ భక్షణ విషయానికి వస్తే అది నిజం కాదు. సమాజంలోని మనుషులు జంతువులను వధించి వాటి శవాలని భక్షిస్తారు. కానీ అఘోరీ అలా తన ఆకలి కోసం ఒక ప్రాణాన్ని తీసి ఆహారంగా మార్చుకోరు. ఇలాంటి అపోహలు నమ్మవద్దు. మహాభారతంలో పాందవులని పాండురాజు యొక్కమృతదేహాన్ని భుజించమంటారు. సహదేవుడు మాత్రమే బ్రొటన వేలు భుజిస్తాడు. భవిష్యత్‌ దర్శన శక్తిని పొందుతాడు. ఇలాంటీ ప్రక్రియే కొన్ని అఘోరీ పంత్‌లలో ఉంటుంది. అది కూడా గురువులు కైలాస ప్రాప్తి పొందిన పిదప ముఖ్య శిష్యుడు మాత్రమే గ్రహిస్తాడు. ముఖ్యంగా ఇంకొక విషయం ఉంది, అఘోరీలు నిధులు తీస్తారు అని, అది పూర్తి అవాస్తవం ఎందుకంటే స్మశానంలో ఉండే వారికి సంపదతో పని ఏంటి ? అలా చెబితే ఎవరూ నమ్మవద్దు అలా చెప్పి వచ్చేవారు అఘోరీలే కాదు.

ముఖ్యంగా ఈ మధ్య బక ప్రశ్న వస్తోంది. అఘోరీలకు బయట పని పంటి, వాళ్ళు స్మశానం వదిలి రారు అని,  కానీ రావాలి. రావలసిన సమయంలో రావాలి ఒక విశిష్టమైన సాంప్రదాయాన్ని అపోహలతో, అపార్థాలతో క్షుద్రంగా చూస్తుంటే అఘోరీ అనే పదానికి అర్ధం తెలియని మూర్జదర్శకులు, సినిమాలు తీసి అఘోరీలని క్షుద్రులుగా, క్రూరులుగా చూపెడుతుంటే చూస్తూ స్మశానంలో కూర్చుంటారా ? ఇకపోతే మిగతా వారిలో నిజమైన అఘోరీ ఎవరికైనా మేలు చేస్తే ఏమి ఆశించడు. కారణం అఘోరి దేవుడిని నమ్ముతాడు , అమ్మడు . అఘోరీ పేరు చెప్పి హోమాలు పూజలు చేసి డబ్బు తీసుకునే వాడు అఘోరీనే కాదు . వారి పట్ల జాగ్రత్త, అఘోరీలేకారు. వారి పట్ల జాగ్రత్త.

మహారాష్ట్రలో సాధువులను చంపినపుడు గానీ, ఇక్కడ రధాలు దర్ధం చేస్తూ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నప్పడు కూడా ముందుకు వచ్చి ధర్మం కోసం నిలబడిన అఘోర్‌ సంస్థాన్‌ బయటకి రాకుండా స్మశానంలో ఉంటే ఎలా అందుకనే ఇప్పడు మీ ముందుకు ఇలా వచ్చింది.

అఘోర సాంప్రదాయ ఉత్పత్తి

తొలిగురువు ఆదినాధుని (పరమ శివుని )నుండి ఆయన పంచ ముఖాలైన , సద్యోజాత , వామ దేవ , తత్పురుష , అఘోర, ఈశాన ముఖాలలో దక్షిణ ముఖమైన అఘోర తత్వాన్ని శ్రీ గురు దత్తాత్రేయ స్వీకరించి తన శిష్యుడైన , శ్రీ గురు జాలంధర్ నాథ్ కు అనుగ్రహించగా , అఘోర పరంపర మొదలైనది . ఆయన నుండి గురు కనీఫా నాధ్ , తదుపరి జోగీ జయపాల్ నాధ్ జీ , తర్వాత గురు వక్ర నాధ్ జి , చక్ర నాథ్ జీ,  అనాధీ నాధ్ జీ , విభూతీ నాధ్ జీ , రామ నాధ్ జీ , ప్రేమ్ నాధ్ జీ , ఆదేశ్ నాధ్ జీ , రాజేష్ నాథ్ జీ, వరకు ప్రస్తుతం కొనసాగుతూ అఘోర సంస్థాన్ గా  పిలవబడుచున్నది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow