ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 10 వేల అప్పు చెల్లించలేదని దళితుడి కాళ్ళు విరిచేయడం దారుణం- కొర్రపాటి

సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారి నియోజకవర్గంలో 10 వేల రూపాయల అప్పు సకాలంలో చెల్లించలేదని చిత్తూరు జిల్లాలో చంద్రన్ అనే దళితుడి కాళ్ళు ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి విరిచేయడం దారుణమని

ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 10 వేల అప్పు చెల్లించలేదని దళితుడి కాళ్ళు విరిచేయడం దారుణం- కొర్రపాటి

*జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువు చిత్తూరు జిల్లాలో 10 వేలు అప్పు సకాలంలో చెల్లించలేదని దళితుడి కాళ్ళు చేతులు విరిచేసిన ఘటనను తీవ్రంగా ఖండించిన మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్* :

దళితలపై దాడులు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైకపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని శిరోముండనాలు వెలివేతలతోపాటు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారి నియోజకవర్గంలో 10 వేల రూపాయల అప్పు సకాలంలో చెల్లించలేదని చిత్తూరు జిల్లాలో చంద్రన్ అనే దళితుడి కాళ్ళు ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి విరిచేయడం దారుణమని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని దళితులకు హోంమంత్రి పదవి ఇస్తే దళతులపై దాడులు పెరిగాయి ఇదే వైకపా హోంశాఖలో సాధించిన అభివృద్ధి అని ఆర్థికాభివృద్ధి లేని పరిపాలన వలన దళితుల ప్రాణాలతో చెలగాటమాడే దుర్ఘటనలు ఏర్పడుతున్నాయని.

చరవాణిలో చిత్తూరు జిల్లా ఎస్పీతో గారితో మాట్లాడగా దుండగునిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించామన్నారు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భాధితుని కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం ప్రభుత్వ ఎక్స్గ్రేషియో ఇవ్వాలని దళితులకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి హోంమంత్రి రాజీనామా చేయాలని కొర్రపాటి డిమాండ్ చేశారు.