దామోదరం సంజీవయ్య జీవితం స్ఫూర్తి దాయకం - Janasena

May 8, 2022 - 11:44
 0
దామోదరం సంజీవయ్య జీవితం స్ఫూర్తి దాయకం - Janasena

భారతీయ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి 50 వ వర్ధంతి సందర్భంగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి జనసేన శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజాసేవకు , విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దామోదరం సంజీవయ్య ఆశయాలను జనసేన పార్టీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు తీసుకున్న సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని , వృధ్యాప్య , విడో ఫింక్షన్ లు ఆయన ప్రవేశ పెట్టినవే అన్నారు.

రాజకీయాల్లో ఉన్నవారు సంజీవయ్య రాజకీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గాదె వెంకటేశ్వరరావు కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ , రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్ , జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు , జిల్లా ఉపాదక్ష్యుడు అడపా మాణిక్యాలరావు , బిట్రగుంట మల్లిక ,కొప్పుల కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , కొనిదేటి కిషోర్ , అరుణ , హైమావతి , శేషు , కొత్తకోట ప్రసాద్ , నెల్లూరి రాజేష్ , మధులాల్ , శిఖా బాలు ,శ్రీభూషయ్య,సతీష్, వందనం,శ్రీనివాస్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow