విద్యను వ్యాపారం చేయొద్దు

Feb 5, 2022 - 15:20
 0
విద్యను వ్యాపారం చేయొద్దు
TJPS COLLEGE STUDENTS PROTEST

TJPS కాలేజీ విద్యార్థులు కాలేజీ ఎయిడెడ్ గా కొనసాగాలని గేట్లు మూసివేసి కాలేజీ స్టాఫ్ ను లోపలికి వెళ్లకుండా కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాల విలీనాన్ని ఉపసంహరించుకుంది. ఎయిడెడ్ గా కొనసాగటానికి 4 ఆప్షన్స్ ఇచ్చింది చాలా మేరకు ఎయిడెడ్ కాలేజీలు నాలుగో ఆప్షన్ ఎంచుకున్నాయి.

తద్వారా ప్రభుత్వం సరెండర్ చేసుకున్నా ఎయిడెడ్ సిబ్బంది లను తిరిగి వెనక్కి ఇచ్చారు. కానీ గుంటూరు నగరంలో ఉన్న TJPS కాలేజీ మాత్రం ఇంతవరకు విల్లింగ్ లెటర్ ఇవ్వలేదు గత రెండు నెలలుగా ఎయిడెడ్ గా కొనసాగటానికి ఆప్షన్ ఇవ్వమని మేనేజ్మెంట్ను విద్యార్థులు ఎంత ప్రాధేయ పడుతున్నా, ధన దాహంతో ఫీజులు పెంచుకుని, విద్యా వ్యాపారం చేయొచ్చని బాగా సంపాదించుకోవచ్చని TJPS కళాశాల మేనేజ్మెంట్ భావిస్తూ విద్యార్థుల డిమాండ్పై లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తున్నారూ , ఎంతోమంది మహానుభావులు దాన దత్తం చేసిన TJPS కాలేజీని ప్రైవేటు గా మార్చి విద్యా వ్యాపారం చేయాలనుకుంటున్న TJPS కాలేజీ మేనేజ్మెంట్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

TJPS కొనసాగితే ఎయిడెడ్ గా కొనసాగాలి లేకుంటే UGC,RUSA ఫండ్స్ ఉన్న TJPS ఎయిడెడ్ కళాశాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని ప్రభుత్వ కళాశాల గా నడపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రూపస్ , సుదర్శన్ , నాని , వెంకీ , సుధీర్ , వంశీ , సమీర్ , జోసఫ్ , హరీష్ , వెంకట్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow